చూస్తుండ‌గానే కాలి బూడిదైన బ‌స్సు.. తృటిలో త‌ప్పిన పెనుప్ర‌మాదం.. ప్ర‌యాణికులంతా సేఫ్‌

Fire Breaks Out In Bus. తృటిలో పెనుప్ర‌మాదం త‌ప్పింది. వివ‌రాళ్లోకెళితే.. జనగామ ఆర్టీసీ కాలనీ సమీపంలో

By Medi Samrat  Published on  18 Oct 2021 3:22 AM GMT
చూస్తుండ‌గానే కాలి బూడిదైన బ‌స్సు.. తృటిలో త‌ప్పిన పెనుప్ర‌మాదం.. ప్ర‌యాణికులంతా సేఫ్‌

తృటిలో పెనుప్ర‌మాదం త‌ప్పింది. వివ‌రాళ్లోకెళితే.. జనగామ ఆర్టీసీ కాలనీ సమీపంలో ప్రమాదవశాత్తు షాక్ సర్క్యూట్ వల్ల ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో TS 04 UD 1089 నెంబర్ గల బస్సు పూర్తిగా మంటల్లో దగ్ధం అయ్యింది. సుమారు 26 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఛత్తీస్‌గ‌ఢ్ నుంచి జగదేవపూర్ టు హైదరాబాద్ కు వెళ్తుండగా లింగాల ఘ‌న్‌పూర్ మండ‌లం నెల్లుట్ల గ్రామం హైవేపై ఉదయం 5:40 గంటల సమయంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది.

ప్ర‌యాణికులు అందరూ నిద్రలో ఉన్న సమయంలో జనగామ ఆర్టీసీ కాలనీ హైవేలో ఒక్కసారిగా బస్సులో నుంచి మంటలు చెలరేగాయి. డ్రైవరు అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించి ప్రయాణికులను కిందికి దింపి వేయడంతో.. అందరూ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ విష‌య‌మై పోలీసులు మాట్లాడుతూ.. ఈ ఉద‌యం బ‌స్సులో అక‌స్మాత్తుగా మంట‌లు చెల‌రేగాయని స‌మాచారం అందింద‌ని.. డ్రైవ‌ర్ అప్ర‌మ‌త్త‌తో వ్య‌వ‌హ‌రించ‌డంతో పెనుప్ర‌మాదం త‌ప్పింద‌ని అన్నారు. ప్ర‌మాద ఘ‌ట‌న‌పై విచార‌ణ చేప‌డుతామ‌న్నారు.


Next Story
Share it