హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గోల్ మసీదు సమీపంలోని ఓ భవనంలో మంటలు చెలరేగాయి. మూడో అంతస్తులో మంటలు ఎగసిపడ్డాయి. స్థానికుల సమాచారంలో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సమీపంలోని దుకాణాలకు మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. భవనంలో చిక్కుకున్న ఆరుగురిని అగ్నిమాపక సిబ్బంది తరలించారు. ఈ అగ్నిప్రమాదంతో పరిసరాల్లో దట్టమైన పొగ కమ్మేసింది. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.