గెలుపు సంబరాల్లో అపశృతి.. తెలంగాణ భవన్‌లో అగ్నిప్రమాదం
Fire accident in Telangana Bhavan.టీఆర్‌ఎస్ కార్యకర్తల అత్యుత్సాహం కారణంగా తెలంగాణ భవన్‌లో మంటలు చెలరేగాయి.
By తోట వంశీ కుమార్ Published on
20 March 2021 1:32 PM GMT

టీఆర్ఎస్ కార్యకర్తల అత్యుత్సాహం కారణంగా తెలంగాణ భవన్‌లో మంటలు చెలరేగాయి. మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్‌ఎస్ అభ్యర్థి వాణీదేవి ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా హైదరాబాదు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చారు. బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకుంటుండగా.. నిప్పురవ్వలు వెళ్లి పక్కనే ఉన్న ఎండిపోయిన చెట్లపై పడి మంటలు చేలరేగాయి. దీంతో.. అప్రమత్తమైన టీఆర్ఎస్ శ్రేణులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరుగలేదని నేతలు స్పష్టం చేశారు.
Next Story