టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో అగ్నిప్ర‌మాదం

Fire Accident in MLA Vidyasagar Rao home.జగిత్యాల జిల్లా కోరుట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగ‌ర్ రావు ఇంట్లో స్వ‌ల్ప

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Jan 2022 9:50 AM IST
టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో అగ్నిప్ర‌మాదం

జగిత్యాల జిల్లా కోరుట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగ‌ర్ రావు ఇంట్లో స్వ‌ల్ప అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. విద్యాసాగ‌ర్ రావు స‌తీమ‌ణి స‌రోజ శ‌నివారం తెల్ల‌వారుజామున ఇంట్లో పిండి వంట‌కాలు చేస్తుండ‌గా గ్యాస్ లీకై ఒక్క‌సారిగా మంట‌లు ఎగిసిప‌డ్డాయి. ఈ ఘ‌ట‌న‌లో ఆమెకు స్వ‌ల్ప గాయాలు అయిన‌ట్లు తెలుస్తోంది. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను ఆర్పివేశారు. ఎమ్మెల్యే భార్య స‌రోజ‌కు స్వ‌ల్ప‌గాయాలు కావ‌డంతో వెంట‌నే చికిత్స కోసం హైద‌రాబాద్ లోని ఓ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు, పార్టీ శ్రేణులు, అభిమానులు ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని ఎమ్మెల్యే కుమారుడు డాక్ట‌ర్ సంజ‌య్ సోష‌ల్ మీడియా వేదిక‌గా కోరారు. కాగా.. ఈ ఘ‌ట‌న జ‌రిగిన స‌మ‌యంలో ఎమ్మెల్యే ఇంట్లో ఉన్నారో లేదో తెలియ‌రాలేదు.

Next Story