బిగ్ బ్రేకింగ్: ఫలకునుమా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు
ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటల చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా రైలులో మంటలు వ్యాపించాయి.
By అంజి
బిగ్ బ్రేకింగ్: ఫలకునుమా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు
ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటల చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా రైలులో మంటలు వ్యాపించాయి. నాలుగు బోగీల్లో భారీగా మంటలు చెలరేగి దట్టంగా పొగలు అలుముకున్నాయి. ఈ అగ్ని ప్రమాదంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మాయిపల్లి - పగిడిపల్లి స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది. మంటలు చెలరేగిన విషయాన్ని గుర్తించిన రైల్వే సిబ్బంది.. బోగీల్లోని ప్రయాణికులను వెంటనే కిందకు దించారు. ఎస్ 3,ఎస్ 4,ఎస్ 5,ఎస్ 6 తో మరో బోగీలకు మంటలు అంటుకోవడంతో వెంటనే రైలును నిలిపివేశారు.
ఐదు బోగీల్లోని మూడు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. రైల్వే సిబ్బంది ప్రయాణికులను దించేయడంతో ప్రాణనష్టం తప్పింది. మరోవైపు ఆరో బోగీ దగ్గర ఉన్న జాయింట్‌ని రైల్వే సిబ్బంది తొలగిస్తున్నారు. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ హావ్‌డా నుంచి సికింద్రాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సంఘటనా స్థలానికి బయల్దేరారు. ఈ ఘటనతో ఆ రూట్‌లో పలు రైళ్ల సర్వీసులకు ఆటంకం ఏర్పడింది. ప్రమాదానికి గల కారణాలపై రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Falaknuma Express Near Ghatkesar (Hyderabad) caught fire🥹 All are safe 🙏🏻 pic.twitter.com/pP5l6X0bSw
— Hemanth Kumar 03 (@hemanth_03) July 7, 2023