Sangareddy: హెటిరో ల్యాబ్స్‌లో భారీ అగ్ని ప్రమాదం

సంగారెడ్డి జిల్లా జిన్నారంలోని గడ్డిపోతారం పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

By అంజి
Published on : 27 May 2024 5:08 PM IST

Fire Accident, Hetero Labs Limited, Sangareddy district, Gaddipotharam, Jinnaram

Sangareddy: హెటిరో ల్యాబ్స్‌లో భారీ అగ్ని ప్రమాదం

సంగారెడ్డి జిల్లా జిన్నారంలోని గడ్డిపోతారం పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గత కొన్ని నెలలుగా హైదరాబాద్‌ నగరంలోని చిన్నచిన్న గోదాములు, కంపెనీలలో అగ్నిప్రమాదంలో సంభవిస్తూ ఉండడంతో సానికులు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే మరొకటి జిన్నారం పరిధిలో చోటు చేసుకుంది. జిన్నారం పరిధిలోని గడ్డి పోతారంలోని పారిశ్రామిక వాడలో ఉన్న హెటిరో పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈటీపీ సెక్షన్లో సాల్వెంట్ రికవరీ చేస్తుండగా సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో.. ఆ కంపెనీలో పని చేస్తున్న సిబ్బంది వెంటనే అప్రమత్తమై బయటికి పరుగులు తీశారు.

పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతూ ఉండడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. భారీగా పొగలు ఆ ప్రాంతాన్ని చుట్టు ముట్టడంతో స్థానికులు భయభ్రాంతులకు గురై వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారాన్ని అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మంటలు చెలరేగిన పరిశ్రమలో ఎవరైనా కార్మికులు చిక్కుకున్నారా... లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది. అగ్ని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. హెటిరో ల్యాబ్ పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు ప్రాథమిక సమాచారం.

Next Story