మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన నూతన రేషన్ కార్డ్‌ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా.. మంత్రి జగదీష్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకే వేదికను పంచుకున్నారు. అయితే.. ఇద్దరు నేతలు వేదిక ఎక్కుతుండగా.. ఇరు పార్టీల కార్యకర్తలు పోటాపోటి నినాదాలతో హోరెత్తించారు. ఆ నినాదాల మధ్య ఇరువురు నేతలు స్టేజీ ఎక్కారు. ఆ తర్వాత కాసేపటికే ఇరువురు నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం కుర్చీలు విసురుకున్నారు. ఈ నేఫథ్యంలో రేషన్ కార్డ్‌ల పంపిణీ కార్యక్రమం రణరంగాన్ని తలపించింది.
ఇదిలావుంటే.. ఇటీవల ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కోసం 2వేల కోట్లు ఇస్తానంటే రాజీనామా చేస్తానని రాజ్‌గోపాల్‌రెడ్డి సవాల్ చేశారు. బైఎలక్షన్ వస్తేనే అభివృద్ధి చేస్తారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలా అయితే తాను ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేస్తానని వెల్లడించారు. అసలు తెలంగాణలో ప్రజాస్వామ్యం అమలు అవుతుందా అని అన్నారు. ఎంతసేపు రాజకీయలబ్ధి తప్పా ప్రజాపాలనపై దృష్టిసారించడం లేదని ఆయన ఎద్దెవా చేశారు.