మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. కాలేజీ బిల్డింగ్ నాలుగో అంతస్తు నుంచి కీర్తి అనే విద్యార్థిని దూకబోయింది. బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఆమె పరీక్షలో ఫెయిల్ అవుతాననే భయంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. భవనం కిటికీలో నుంచి దూకబోయిన విద్యార్థినిని గమనించిన తోటి విద్యార్థులు సమయస్ఫూర్తితో రక్షించారు. కాలేజీ సెక్యూరిటీ సిబ్బంది సకాలంలో స్పందించడంతో ప్రాణాపాయం తప్పింది. దీంతో కాలేజీ లెక్చరర్లు, తోటి విద్యార్థులందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా మల్లారెడ్డి విద్యాసంస్థల్లో గత ఏడాది కాలంలో పలువురు స్టూడెంట్స్ సూసైడ్స్ చేసుకోవడం.. ఇటీవలే ఇంజనీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్‌లో విద్యార్థిని వీడియోలు, ఫొటోలు తీసిన ఘటన వివాదాస్పదమైంది.