తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు అభివాదం చేసేందుకు ప్రయత్నించి తండ్రీకూతురు బైక్ పైనుంచి పడిపోయారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో పాల్గొనేందుకు కవిత వెళ్తుండగా ఆమెకు అభివాదం చేసేందుకు ప్రయత్నించి బైక్ పై నుంచి ఓ తండ్రీకుమార్తె పడిపోయారు. యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనలో భాగంగా బీబీ నగర్ ఎయిమ్స్‌కు వెళ్తుండగా నారపల్లి వద్ద కవితకి తండ్రి కూతురు అభివాదం చేశారు.
అయితే ఈ క్రమంలో బైక్ అదుపుతప్పడంతో ఇద్దరు కింద పడిపోయారు. వెంటనే గమనించిన కవిత తన వాహనాన్ని పక్కకు నిలిపి గాయపడిన తండ్రీకుమార్తె దగ్గరికి వెళ్లి పరామర్శించారు. తన కాన్వాయ్‌లోని ఓ వాహనంలో స్థానిక ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం అక్కడ తండ్రీకుమార్తెలకు హాస్పిటల్ వైద్యులు ప్రథమ చికిత్స చేసి ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు.