నిజామాబాద్ జిల్లా ఇసపల్లి గ్రామంలో అర్వింద్ ధర్మపురికి వ్యతిరేకంగా పసుపు రైతులు మంగళవారం నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టారు. నందిపేట్ మండలంలో పర్యటిస్తున్న ఎంపీ అరవింద్ కు వ్యతిరేకంగా పసుపు రైతులు గ్రామాల్లో మోహరించారు. పసుపు బోర్డ్ ఎక్కడ? అని రైతులు ప్లకార్డులతో కాన్వాయ్ ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అరవింద్ వెంటనే రాజీనామా చేయాలని పసుపు రైతులు డిమాండ్ చేశారు. అరవింద్ రాసిచ్చిన బాండు పేపరు రికార్డులను చూపిస్తూ పసుపు రైతులు నిరసన తెలిపారు. రైతుల ఆగ్రహంతో కారు ఆపకుండా వెనుదిరిగి వెళ్లిపోయారు ఎంపీ అర్వింద్. అర్వింద్ ను జిల్లాలో తిరగనియం అని రైతు సంఘాల నాయకులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు పరిస్థితిని అదుపుచేసే ప్రయత్నం చేశారు. ఈ విషయమై ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ.. మమల్ని అడ్డుకున్నది పసుపు రైతులు కాదు.. టీఆర్ఎస్ శ్రేణలు అని అన్నారు.