రవాణా శాఖకు కాసుల వర్షం కురిపించిన‌ ఫ్యాన్సీ నంబర్లు..!

ఫ్యాన్సీ నెంబర్లకు ఇంత క్రేజ్‌నా అంటారు వాటి కోసం ఖ‌ర్చు చేసిన డ‌బ్బు గురించి తెలిస్తే..

By Medi Samrat  Published on  26 Nov 2024 9:15 PM IST
రవాణా శాఖకు కాసుల వర్షం కురిపించిన‌ ఫ్యాన్సీ నంబర్లు..!

ఫ్యాన్సీ నెంబర్లకు ఇంత క్రేజీనా అంటారు వాటి కోసం ఖ‌ర్చు చేసిన డ‌బ్బు గురించి తెలిస్తే.. హైద్రాబాద్ సెంట్రల్ జోన్ ఖైరతాబాద్ కార్యాలయంలో నిర్వహించిన ఫ్యాన్సీ నెంబర్ల వేలంలో లక్షల రూపాయలుపెట్టీ ఫ్యాన్సీ నెంబర్లను దక్కించుకుంటున్నారు వాహ‌న‌దారులు. కొత్త TG సిరీస్ నెంబ‌ర్లైన‌ 0001, 0009, 9999, 0009, 0007, 0006, 0005, 0077, 0099ను లక్షలు ఖర్చు చేసి వేలంలో దక్కించుకున్నారు. ఖైరతాబాద్ ఆర్టీఏ పరిధిలో ఒక్కరోజులో 52,52,283 రూపాయల బిడ్ పలికింది. TG 09 D 0001 నెంబర్ కోసం రుద్రరాజు రాజీవ్ కుమార్ అనే వ్య‌క్తి 11 లక్షల 11 వేల 111 రూపాయలు ఖ‌ర్చు చేశారు. అలాగే TG 09 D 0009 నెంబర్‌ను 10 లక్షల 40 వేలకు మెగా ఇంజనీరింగ్ అండ్ ఇంఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సొంతం చేసుకుంది. అదే విధంగా TG 09 C 9999 నెంబర్ ని 7 లక్షల 19 వేల 999 రూపాయలకు శ్రీయాన్ కన్స్ట్రక్షన్స్ సొంతం చేసుకుంది. TG 09 D 0006 నెంబర్ ని 3 లక్షల 65 వేల రూపాయలకు పోరస్ అగ్రో ఫుడ్ ప్రాడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు సొంతం చేసుకుంది. TG 09 D 0005 నెంబర్ వేగ శ్రీ గోల్డెన్ డైమండ్స్ వారు దక్కించుకున్నారు. ఫ్యాన్సీ నెంబర్ల‌కు క్రేజ్‌ పెర‌గ‌డంతో రవాణా శాఖకు కాసుల వ‌ర్షం కురుస్తుంది.

Next Story