Hanumakonda : రికార్డు ధర పలికిన‌ ఫ్యాన్సీ నంబర్‌ ‘9999’

తెలంగాణలోని హనుమకొండ జిల్లాలో ఓ ఫ్యాన్సీ వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ రికార్డు స్థాయిలో రూ.12.60 లక్షల ధర పలికింది.

By Medi Samrat
Published on : 28 May 2025 11:03 AM IST

Hanumakonda : రికార్డు ధర పలికిన‌ ఫ్యాన్సీ నంబర్‌ ‘9999’

తెలంగాణలోని హనుమకొండ జిల్లాలో ఓ ఫ్యాన్సీ వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ రికార్డు స్థాయిలో రూ.12.60 లక్షల ధర పలికింది. హసన్‌పర్తి మండలం చింతగట్టు క్యాంపులోని జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో ప్రాంతీయ రవాణా సంస్థ (ఆర్‌టీఏ) అధికారులు “టీజీఏ 03ఏ 9999” రిజిస్ట్రేషన్ నంబర్ కోసం ఆన్‌లైన్ టెండర్లను ఆహ్వానించారు.

ప్రభుత్వం బేస్ ధర రూ.50,000గా నిర్ణయించగా, బిడ్డింగ్ లో తీవ్ర పోటీ నెలకొంది. మే 27 మంగళవారం జరిగిన ఆన్‌లైన్ వేలం సందర్భంగా హనుమకొండకు చెందిన కావేరీ ఇంజినీరింగ్ యాజమాన్యం ఆ ఫ్యాన్సీ నంబర్‌కు రూ. 12.60 లక్షలను కోట్ చేసింది. మ‌రికొంత‌మంది కూడా రూ. 12 లక్షల వరకు బిడ్‌లను సమర్పించారు.

ఇదిలావుంటే.. హైదరాబాద్‌లోని ప్రాంతీయ రవాణా సంస్థ (RTA) ఏప్రిల్ 2025లో ఫ్యాన్సీ వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ల వేలం ద్వారా రూ. 37.15 లక్షలు ఆర్జించింది. వేలం వేసిన వారిలో ప్రముఖ టాలీవుడ్ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రూ.7.75 లక్షలకు అత్యంత డిమాండ్ ఉన్న ‘0001’ రిజిస్ట్రేషన్ నంబర్‌ను దక్కించుకుని వార్తల్లో నిలిచారు.

Next Story