ఫాల్కన్ కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సంస్థకు చెందిన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) జప్తు చేసింది. రూ.18.14 కోట్ల విలువైన 12 స్థిరాస్తులను అటాచ్ చేసినట్లు శుక్రవారం ఈడీ అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఈ కంపెనీ రూ.792 కోట్లు మోసం చేసినట్లు ఈడీ గుర్తించింది. మోసపూరిత పొందిన నిధులతో కొనుగోలు చేసిన ప్రైవేట్ జెట్ ను ఈడీ గతంలో స్వాధీనం చేసుకుంది.
ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరిట మెస్సర్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో పాటు అమరీదీప్ కుమార్ పై ఈడీ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. అధిక లాభాల ఆశ చూపించి 7,056 మంది నుంచి సుమారు రూ. 4,215 కోట్లు వసూలు చేసినట్లు ఫాల్కన్ సంస్థపై ఆరోపణలు ఉన్నాయి. 4065 మంది బాధితులకు రూ.792 కోట్లు చెల్లించకుండా మోసం చేసినట్లు అధికారులు గుర్తించారు.