హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో నిర్వహించే అన్ని పరీక్షలను వాయిదా వేసినట్టు వర్సిటీ రిజిస్ట్రార్ వెల్లడించారు. ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పరీక్షలను వాయిదా వేసినట్టు తెలిపారు. పరీక్షల రీ షెడ్యూల్ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలకు సెలవులు ప్రకటించడంతో ఇవాళ, రేపు జరగాల్సిన పరీక్షలన్నింటిని వాయిదా వేస్తున్నామని వర్సిటీ రిజిస్ట్రార్ ప్రకటించారు. వాయిదా పడిన పరీక్షల కొత్త తేదీలన త్వరలో వెబ్‌సైట్ ద్వారా ప్రకటిస్తామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు జాగ్రత్తగా రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. గురువారం, శుక్రవారం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించినట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. తిరిగి పాఠశాలలు శనివారం ప్రారంభమవుతాయని వెల్లడించారు. రాష్ట్రానికి భారీ వర్షం ముప్పు ఉందని హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వర్షాల కారణంగా ఇవాళ జరగాల్సిన అన్ని పరీక్షలను రద్దు అయ్యాయి. ఈ మేరకు ఆయా యూనివర్శిటీలు ప్రకటన విడుదల చేశాయి.