Video : బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కూన శ్రీశైలం వార్నింగ్‌

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ పై మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఫైర్ అయ్యారు.

By Medi Samrat  Published on  17 Sept 2024 1:34 PM IST
Video : బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కూన శ్రీశైలం వార్నింగ్‌

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ పై మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఫైర్ అయ్యారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయ‌న‌ మాట్లాడుతూ.. కుత్బుల్లాపూర్ గల్లీల్లో వివేక్ ను ఉరికిచ్చి కొడుతాం.. మా సీఎం రేవంత్ రెడ్డిపై మాట్లాడే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకో అని హెచ్చ‌రించారు.

టీడీపీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి పిరాయించిన నీకు మా నాయకులపై మాట్లాడే అర్హత లేదన్నారు. ఎన్నికల ముందు నువ్వు నాపై దాడికి వచ్చినవ్.. నాకు సంస్కారం ఉండి నీపై తిరిగి దాడి చేయలేదు. రాష్ట్రంలో భద్రత గురించి నువ్వా మాట్లాడేది.. నీ భాష మార్చుకోకపోతే కుత్బుల్లాపూర్ లో తిరగనియ్యం అని హెచ్చరించారు.

Next Story