అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ సీఎం కేసీఆర్ : మదన్ లాల్

తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే అభివృద్ధి అని వైరా బీఆర్ఎస్‌ పార్టీ అభ్యర్థి బానోత్ మదన్ లాల్ అన్నారు.

By Medi Samrat  Published on  6 Sept 2023 4:20 PM IST
అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ సీఎం కేసీఆర్ : మదన్ లాల్

తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే అభివృద్ధి అని మాజీ ఎమ్మెల్యే, వైరా బీఆర్ఎస్‌ పార్టీ అభ్యర్థి బానోత్ మదన్ లాల్ అన్నారు. బుధవారం కారేపల్లిలో జరిగిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి అంటే ముఖ్యమంత్రి కేసీఆర్.. కేసీఆర్ అంటే అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ అని అన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమం వైపు చూస్తున్నాయని పేర్కొన్నారు. పలు రాష్ట్రాల ప్రజల, నాయకుల విజ్ఞప్తి మేరకే దేశంలో కేసీఆర్‌ సంక్షేమ పథకాలు అందాలని భార‌త రాష్ట్ర స‌మితిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేయటం జరిగిందన్నారు.

వైరా నియోజకవర్గంలో ఎలాంటి అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు లేకుండా మనమంతా ఒక కుటుంబంలా ఉండి బీఆర్ఎస్ పార్టీ గెలుపే ధ్యేయంగా పని చేద్దామని అన్నారు. ప్ర‌స్తుత ఎమ్మెల్యే రాములు నాయక్ సూచనలను పాటిస్తూ ప్రతి ఒక్కరం కలిసికట్టుగా ఉండి పార్టీ గెలుపే ధ్యేయంగా ముందుకు పోదామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముచ్చ‌ట‌గా మూడోసారి సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టి.. అభివృద్ధి, సంక్షేమం ఆగకుండా ముందుకు పోయేందుకు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ సైనికులు న‌డుం బిగించాల‌న్నారు.

కేసీఆర్ సంక్షేమ పథకాలను ఇంటింటికి వివరిస్తూ కార్య‌క‌ర్త‌లు బీఆర్ఎస్‌ అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా పనిచేయాలన్నారు. నేను అందరివాడిని ఎప్పుడు ఏ సమస్య వచ్చినా.. ఆపదొచ్చిన ప్రతి ఒక్కరికీ అండగా ఉండి కాపాడుకుంటానని మదన్ లాల్ అన్నారు.

Next Story