జిల్లాకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి.. సంతోషమే కానీ..
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నమ్మి ప్రజలు ఓట్లు వేసి మోసపోయిండ్రని.. ఆ విషయం ఇప్పుడిప్పుడే ప్రజలు తెలుసుకుంటున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
By Medi Samrat
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నమ్మి ప్రజలు ఓట్లు వేసి మోసపోయిండ్రని.. ఆ విషయం ఇప్పుడిప్పుడే ప్రజలు తెలుసుకుంటున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గ్రామాలలోకి నాయకులూ వస్తే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో అడగండని సూచించారు. మహబూబ్ నగర్‌లో తప్పుడు ప్రచారం చేసి ఎన్నికల్లో గెలిచారు.. ఒక్క ఆరోపణ కూడా నిరూపించలేక పోయారన్నారు. ఎన్నికల్లో గెలిచినా తరువాత అభివృద్ధిపై దృష్టి సారించకుండా.. కేవలం విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఇసుక మాఫియాపై అధికారులు దృష్టి సారించాలన్నారు.
ఎన్నికల్లో నాయకులందరూ కూడా సహనం, ఓపికతో ఉండండి.. ప్రజలు మనవైపు ఉన్నారు.. ఎవరు రెచ్చగొట్టినా గ్రామాల్లో ఆవేశాలకు పోవద్దన్నారు. ఇప్పుడు పార్టీ కోసం పనిచేస్తున్న వారికీ భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కలిసి సమిష్టిగా పనిచేయాలి.. టికెట్ ఎవరికి వచ్చినా పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
సోషల్ మీడియాలో నీళ్లు వస్తలేవని అడిగితే కేసులు పెడుతున్నారు.. మాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీకు అండగా ఉంటాము.. పార్టీ అండగా ఉంటుందన్నారు. తప్పుడు కేసులకు భయపడవద్దు.. తిరిగి మనం అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. అధికారంలోకి వచ్చేందుకు ప్రతిఒక్కరూ పనిచేయాలి.. మన లక్ష్యం మహబూబ్ నగర్ అభివృద్ధి ఉండాలన్నారు. పదేండ్లలో మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేసాను.. ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు.
జిల్లాకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే సంతోషమే కానీ జిల్లాకు ఆయన చేసిందేమి లేదన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ 90 శాతం పూర్తి ఐంది.. మరో 10 శాతం పనులు పూర్తి చేస్తే జిల్లాకు ప్రయోజనం కలుగుతుందన్నారు. తెలంగాణ కోసం పోరాటం చేసినం.. జైళ్లకు పోయినం.. పదేండ్లు తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేసినం.. కానీ ముఖ్యమంత్రి ఏం అభివృద్ధి చేయకుండా మాట్లాడితే ఎవరు పడరు అన్నారు. జిల్లా మంత్రులు, ఏమ్మెల్యే లు అందరు ఐక్యంగా పనిచేసి జిల్లా అభివృద్ధికోసం కృషి చేయాలన్నారు.