ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామనడం బీజేపీ ఆహంకానికి నిదర్శనం

Ex Minister Shabbir Ali Fire On Amit Shah. దేశం లో అంబేద్క‌ర్ రాజ్యంగం నడుస్తుందా.. బీజేపీ రాజ్యంగం నడుస్తుందా.. అని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ప్ర‌శ్నించారు.

By Medi Samrat  Published on  24 April 2023 5:30 PM IST
ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామనడం బీజేపీ ఆహంకానికి నిదర్శనం

Shabbir Ali


దేశం లో అంబేద్క‌ర్ రాజ్యంగం నడుస్తుందా.. బీజేపీ రాజ్యంగం నడుస్తుందా.. అని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ప్ర‌శ్నించారు. హోంమంత్రి గా అమిత్ షా అన్ ఫిట్ అని అన్నారు. ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామనడం బీజేపీ ఆహంకానికి నిదర్శనమ‌ని మండిప‌డ్డారు. మత పరమైన రిజర్వేషన్లు చెల్లవని సుప్రీంకోర్టు చెప్పింది.. కానీ పేదలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కూడా సూచించిందని గుర్తుచేశారు. మా ప్రభుత్వం వెనకబడిన ముస్లిం లకు మాత్రమే రిజర్వేషన్లు ఇచ్చింద‌ని పేర్కొన్నారు.

పేద ముస్లింలకు ఇచ్చే రిజర్వేషన్లు తొలగిస్తామంటే ఎలా అని నిల‌దీశారు. మత పరంగా ముస్లిం లను శత్రువులు గా చూస్తే ఏలా అని అడిగారు. హోంమంత్రి రాజ్యంగ విరుద్ధంగా ఎలా మాట్లాడుతారని ప్ర‌శ్నించారు. ముస్లిం రిజర్వేషన్లు తొలగించడం అమిత్ షా తరం కాదని అన్నారు. అమిత్ షా పై రాజ్యాంగ పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమిత్ షా వాఖ్యల పై సుప్రీంకోర్టు లో పిటీషన్ వేస్తాన‌ని అన్నారు. ఒక‌ వర్గానికి అమిత్ షా హోంమంత్రి కాదు.. ఈ దేశానికి అన్న విషయం మర్చిపోయారని అన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువుకున్నాన‌ని చెప్పుకునే ఈటెల కు ఇన్ని కోట్లు ఎలా వచ్చాయని ప్ర‌శ్నించారు. మునుగోడు ఉప ఎన్నికలు జరిగిన 6 నెలల తర్వాత ఈటెల ఇప్పుడు ఆరోపణలు చేయడం ఏంటి.. కాంగ్రెస్ లోకి వస్తా అని ఈటెల మా తలుపులు తట్టలేదా అని ప్ర‌శ్నించారు.


Next Story