మాజీ మంత్రి కమతం రామిరెడ్డి కన్నుమూత
Ex Minister Kamatham Ram Reddy Passes Away. టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కమతం రామిరెడ్డి(83) కన్నుమూశారు.
By Medi Samrat Published on
5 Dec 2020 3:39 AM GMT

టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కమతం రామిరెడ్డి(83) కన్నుమూశారు. కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా ఉన్న ఆయనకు 2014 ఎన్నికల్లో పార్టీ టికెట్ నిరాకరించడంతో.. బీజేపీలో చేరి టీడీపీ – బీజేపీ కూటమి తరపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ ఎన్నికలలో రామ్ రెడ్డికి కేవలం 13355 ఓట్లు మాత్రమే వచ్చాయి.
ఇక 2018 ఎన్నికల సమయానికి ఆయన్ని బీజేపీ సస్పెండ్ చేసింది. దీంతో ఆయన సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ నుండి తన రాజకీయ జీవితం ప్రారంభించిన కమతం రామిరెడ్డి 1967లో ఇండిపెండెంటుగాను, 1972, 1989లలో కాంగ్రెస్ తరపున గెలిచారు. ఈయన జలగం వెంగళరావు క్యాబినెట్ లోనూ, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి మంత్రివర్గాల్లో కూడా మంత్రిగా పని చేశారు.
Next Story