అహంకారానికి మారుపేరు కేసీఆర్ : మాజీ మంత్రి జూపల్లి

బీఆర్ఎస్ మేనిఫెస్టోలో కేసీఆర్ అహంకారం, మేనేజ్‌మెంట్‌ గురించి నా పేరు ప్రస్తావిస్తూ మాట్లాడారని.. అహంకారానికి మారుపేరు కేసీఆర్

By Medi Samrat  Published on  16 Oct 2023 2:53 PM GMT
అహంకారానికి మారుపేరు కేసీఆర్ : మాజీ మంత్రి జూపల్లి

బీఆర్ఎస్ మేనిఫెస్టోలో కేసీఆర్ అహంకారం, మేనేజ్‌మెంట్‌ గురించి నా పేరు ప్రస్తావిస్తూ మాట్లాడారని.. అహంకారానికి మారుపేరు కేసీఆర్ అని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మండిప‌డ్డారు. గాంధీభవన్ లో ఆయ‌ర మాట్లాడుతూ.. తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేశా.. అహంకారం ఉంటే ఇలా చేస్తారా.. అని ప్ర‌శ్నించారు. అహంకారంతో వేల కోట్లు మేనేజ్ చేసి ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. మేనేజ్ చేయడానికి మీలాగా అవినీతికి పాల్పడలేదని అన్నారు. మీరు అహంకారంతో అంబేద్క‌ర్ విగ్రహానికి పూల‌మాల వేయలేదు.. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను పరామర్శించలేదు.. డబ్బు, అహంకారంతో మంత్రులు వ‌చ్చినా గేట్లు తెరవరని నిప్పులు చెరిగారు. మీ దగ్గర వేల కోట్లు ఉన్నా, పదవులు ఉన్నా నా కాలి గోటికి సరిపోరని అన్నారు. మీ కొడుకు.. అల్లుడు వస్తారా చర్చకు రండి.. ఏ విషయంలో మీరు గొప్పోళ్లు.. అని ప్ర‌శ్నలు సంధించారు.

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ధర్నా చౌక్ ఇందిరా పార్క్‌ను ఎత్తివేశారు.. కమ్యూనిస్ట్ లని తోక పార్టీలు అన్నావ్.. 2014లో మాది మేనిఫెస్టో అంటే భగవ‌ద్గీత‌, బైబిల్, ఖురాన్‌ అన్నావు.. దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూంలు ఏమయ్యాయన్నారు. ప్రగతి భవన్ కంటే ఢిల్లీలో ఎవరు వెళ్లిన కలిసే అవకాశం ఉంటుంది. జాతీయ పార్టీ అయిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీల వద్దకు ఎవరు వెళ్లినా కలవచ్చు.. మీ దగ్గర ప్రగతి భవన్ వద్దకు అయిన రాగలరా అని ప్ర‌శ్నించారు.

కొల్లాపూర్ లో సభ పెట్టినప్పుడు ఉద్యమంలో మంత్రి పదవికి రాజీనామా చేసాడని అన్నావు.. ఇప్పుడు ఏమైందని నిల‌దీశారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ గాలి విస్తుంటే నువ్వు ఓడిపోలేదా.. ఎంపీగా వినోద్ ఓడిపోలేదా.. నీ బిడ్డ కవిత మేనేజ్ చేయలేకుండానే ఓడిపోయిందా.. అని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల మీద జనాలకు నమ్మకం పోయిందన్నారు. రైతు బంధు లో 15 వేలు ఇస్తామని , పెన్షన్ 4 వేలు ఇస్తామని కాంగ్రెస్ గ్యారంటీ స్కీమ్స్ లో తెలిపింది.. అది సాధ్యం కాదన్నారు. ఇప్పుడు దానికి వెయ్యి ఎక్కువ పెట్టి మేనిఫెస్టో ప్రకటించారని దుయ్య‌బ‌ట్టారు. కేసీఆర్ మాటలతో మరోసారి మోసపోవద్దని అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఋణం తీర్చుకోవాలన్నారు. హుజురాబాద్‌లో ఒక వ్యక్తిని ఓడించడం కోసం 2 వేల కోట్లతో దళిత బంధు ఇచ్చావు.. మరి రాష్ట్రం మొత్తం దళిత బంధు ఎందుకు ఇవ్వలేదని ప్ర‌శ్నించారు.

Next Story