ఎన్నిక‌ల ముందు రాహుల్ అశోక్ నగర్‌కు వ‌చ్చారు.. ఇప్పుడు రావాలి : హ‌రీశ్ రావు

రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలకు ఎగనామం పెట్టారని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు.

By Kalasani Durgapraveen  Published on  4 Nov 2024 3:01 PM IST
ఎన్నిక‌ల ముందు రాహుల్ అశోక్ నగర్‌కు వ‌చ్చారు.. ఇప్పుడు రావాలి : హ‌రీశ్ రావు

రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలకు ఎగనామం పెట్టారని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. 11 నెలల నుండి మాజీ సర్పంచులకు బిల్లులు రాలేదు.. సీఎం కు, పంచాయతీ రాజ్ శాఖా మంత్రికి వినతిపత్రం ఇవ్వాలని సర్పంచులు భావిస్తే దొంగల్లా అరెస్టు చేశారన్నారు. తెలంగాణ సర్పంచులు దేశానికి ఆదర్శంగా నిలిచారని, అనేక అవార్డులు తెలంగాణ సర్పంచులకు వచ్చాయి అన్నారు. ఎన్నికల సమయంలో సర్పంచులకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. సర్పంచులు నేడు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. కేంద్రం నుండి గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం దారి మళ్ళిస్తోందన్నారు.

తెలంగాణకు రాహుల్ గాంధీ వస్తున్నారు.. రాహుల్ గాంధీ అశోక్ నగర్ కు రావాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ అశోక్ నగర్ కు వచ్చారు. విద్యార్థులతో చర్చలు జరపాలి.. జీవో 29 ను రద్దు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలను రేవంత్ రెడ్డి నిర్వీర్యం చేశారన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు అవుతున్నాయా లేదా రాహుల్ గాంధీ రివ్యూ చేయాలన్నారు.

అన్ని వర్గాలను మోసం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టు చేసిన సర్పంచులను విడుదల చేయాలని డిమాండ్ చేసారు. పెద్ద,పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారు. సర్పంచులకు బిల్లులు ఎందుకు ఇవ్వడం లేదో చేపాలన్నారు. గ్రామాలను అభివృద్ధి చేసిన శిక్ష ఎందుకు.. గ్రామ పంచాయతీకు ఆర్ధిక సంఘం నిధులు వచ్చాయి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫ్రీజింగ్ ఎత్తివేయాలన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో రెండు వేల కోట్లు బకాయిలు వుంటే బిఆర్ఎస్ అధికారంలోకి రాగానే చెల్లించామని తెలిపారు. బిఆర్ఎస్ పదేళ్లల్లో 4 లక్షల 26 వేల కోట్లు అప్పు చేస్తే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కాకుండానే 85 వేల కోట్లు అప్పు చేసిందన్నారు. కాంగ్రెస్ వచ్చాక సంక్షేమ పథకాలు బంద్ పెట్టిందన్నారు. పోలీసులకు సరెండర్ లీవ్ బంద్ చేశారు.. టీజీఎస్పీ పోలీసులు రోడ్ల మీదకు వచ్చారన్నారు.

Next Story