పిల్లలు ఈ దేశ సంపద.. వాళ్లని పట్టించుకోకపోతే ఎలా?

Ex Minister Geetha Reddy Fire On Govt. ప్రభుత్వ విద్యాసంస్థల్లోని హాస్టల్స్ లో కలుషిత ఆహారం కలుషిత నీళ్లతో విద్యార్థులు

By Medi Samrat  Published on  20 July 2022 11:55 AM GMT
పిల్లలు ఈ దేశ సంపద.. వాళ్లని పట్టించుకోకపోతే ఎలా?

ప్రభుత్వ విద్యాసంస్థల్లోని హాస్టల్స్ లో కలుషిత ఆహారం కలుషిత నీళ్లతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని మాజీమంత్రి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి అన్నారు. తండ్రి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి ఒక్కసారైనా హాస్టల్ విజిట్ చేస్తే ఎలాంటి పరిస్థితి ఉండకపోయేదని వ్యాఖ్యానించారు. సిద్దిపేట రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్ లో ఇబ్బంది జరిగినా హెల్త్ మినిస్టర్ వెళ్ళలేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సిద్దిపేట రెసిడెన్షియల్ పాఠశాల మెస్ కాంట్రాక్టర్ తెలంగాణ మంత్రి బంధువు అని అన్నారు.

పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు పోరాడుతుంటే.. సిల్లీ ఇష్యూస్ అని మంత్రులు అంటున్నారని.. పిల్లలు ఈ దేశ సంపద. వాళ్లని పట్టించుకోకపోతే ఎలా? అని ప్ర‌శ్నించారు. నిధుల కొరత కూడా కలుషిత ఆహారానికి కారణమ‌న్న ఆమె.. విద్యార్థినుల వ్యక్తిగత అంశాలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. బాసర ఐఐఐటిలో మెస్ ల అంశం పెద్ద స్కాం అని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనేక ప్రభుత్వ విద్యాసంస్థల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. వరద బాధితుల కోసం తిరిగే ముఖ్యమంత్రి హాస్టల్ విద్యార్థుల కోసం కూడా తిరగాలని అన్నారు.











Next Story