కర్నూలు బస్సు ప్రమాదంలో మరణించిన తెలంగాణ పౌరులకు రాష్ట్ర ప్రభుతం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో కర్నూల్ బస్సు ప్రమాదంలో మరణించిన తెలంగాణ పౌరులకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున 5 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. గాయపడిన క్షతగాత్రులకు 2 లక్షల రూపాయలు ప్రకటించినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు.
20కి చేరిన మృతుల సంఖ్య
కర్నూలు (Kurnool) శివారు చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఇప్పటి వరకు బైకర్ శివశంకర్‌తో సహా 20 మంది మరణించారు. వారి మృతదేహాలను కూడా వెలికితీసినట్లుగా అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో మొత్తం 23 మంది క్షేమంగా బయటపడ్డారు. అయితే, ఇంకా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది