మ‌రో ప‌ద‌వికి రాజీనామా చేసిన ఈటల

Etela Resigned Exhibition Society President Post. భూముల కబ్జా ఆరోపణలతో మంత్రి పదవిని కోల్పోయి.. ఆ తర్వాత ఎమ్మెల్యే పదవి‌తో

By Medi Samrat
Published on : 15 Jun 2021 8:11 PM IST

మ‌రో ప‌ద‌వికి రాజీనామా చేసిన ఈటల

భూముల కబ్జా ఆరోపణలతో మంత్రి పదవిని కోల్పోయి.. ఆ తర్వాత ఎమ్మెల్యే పదవి‌తోపాటు టీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పిన ఈటల రాజేందర్ తాజాగా.. నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేర‌కు రాజీనామా పత్రాన్ని ఎగ్జిబిషన్‌ సొసైటీ సెక్రటరీకి ఈటల పంపారు. ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేరిన ఈటెల‌.. మంగళవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. అనంత‌రం ఆయన నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు. 2014 నుంచి ఎగ్జిబిషన్ సొసైటీ ప్రెసిడెంట్‌గా ఆయన కొనసాగారు. తాజాగా జరిగిన పరిణామాలతో ఆయన రాజీనామా చేశారు. దీంతో సొసైటీ పాలకమండలి సభ్యులు సమావేశం అయి ఈటల రాజీనామాకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.


Next Story