నాలాంటి వాడిని పదేపదే ఆ విష‌య‌మై ప్రశ్నించకండి : ఈటెల

Etela Rajender Reaction On Party Change Rumor. బీజేపీ నేత, ఈటెల రాజేంద‌ర్ పార్టీ మార్పు వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

By Medi Samrat  Published on  30 Jun 2023 7:12 PM IST
నాలాంటి వాడిని పదేపదే ఆ విష‌య‌మై ప్రశ్నించకండి : ఈటెల

బీజేపీ నేత, ఈటెల రాజేంద‌ర్ పార్టీ మార్పు వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో మీడియా ప్ర‌తినిధులు మ‌రోమారు ఆయ‌న‌ను ఈ విష‌య‌మై ప్ర‌శ్నించారు. ఈటెల స‌మాధాన‌మిస్తూ.. నాలాంటి వ్య‌క్తిని ప‌దే ప‌దే ఇలాంటి ప్ర‌శ్న‌లు అడ‌గ‌వ‌ద్ద‌ని సూచించారు. ఉద‌యం, మ‌ద్యాహ్నం, సాయంత్రం ఇలా పూట‌కోసారి నేనే స‌మాధానం ఇచ్చుకోలేన‌న్నారు. పార్టీలు మారుడంటే.. బట్టలు మార్చినంత ఈసీ కాదని గ‌తంలో చెప్పిన‌ట్లు గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల‌నే ఆతృత‌లో ఉన్న‌టుంది.. అందుకే వీళ్లు వ‌స్తున్నారు.. వాళ్లు వ‌స్తున్నారు అనే ప్ర‌చారం చేస్తున్నార‌ని.. ఇటువంటి వార్త‌ల‌తో, సోష‌ల్ మీడియా పోస్టుల‌తో హైప్ క్రియేట్ చేస్తే అధికారం ద‌క్క‌ద‌ని అన్నారు.

బీఆర్ఎస్ పార్టీ మీద వ్య‌తిరేక‌త ఉంద‌న్న మాట వాస్త‌వం అని ఈటెల కామెంట్ చేశారు. ఆ వ్య‌తిరేక‌త‌ను ఎవ‌రు సొమ్ము చేసుకుంటారో చూడాల్సివుంద‌ని అన్నారు. కేసీఆర్ వేలాది ఎక‌రాల అసైన్‌మెంట్ భూముల‌ను గుంజుకున్నాడు.. అర‌చేతిలో వైకుంఠం చూపించాడ‌ని ఈటెల ఆరోపించారు. చివ‌రికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క‌లుద్దామ‌న్నా క‌ల‌వ‌లేని ప‌రిస్థితి నెల‌కొంద‌ని అన్నారు. అభివృద్ధి కోసం మాత్రమే కాదు తెలంగాణ తెచ్చుకుంది.. అత్మగౌరవం కోసం కూడాన‌ని ఈటెల వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలలో కేసీఆర్ తన కోవర్టులను పెట్టుకుంటాడ‌ని .. అప్రమ‌త్తంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని హెచ్చ‌రించారు ఈటెల‌.


Next Story