నేడు బీజేపీలోకి ఈటల
Etela Rajender join in bjp today.మాజీ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం బీజేపీ
By తోట వంశీ కుమార్ Published on 14 Jun 2021 2:11 AM GMTమాజీ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం బీజేపీ(భారతీయ జనతా పార్టీ)లో చేరనున్నారు. ఈ ఉదయం ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ బయలు దేరి వెళ్లారు. ఉదయం 11 గంటలకు తరువాత ఈటల రాజేందర్, ఇతర నేతలు బీజేపీ సభ్యత్వం తీసుకోనున్నారు. సభ్యత్వం తీసుకున్న అనంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈటల రాజేందర్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, రమేశ్ రాథోడ్, తుల ఉమతో పాటు ముఖ్యనేతలు మొత్తంగా 20 మంది వరకు జేపీ నడ్డా అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీలోనే ఉండగా, జమ్మూ కశ్మీర్‌లో ఉన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా ఢిల్లీకి వచ్చే అవకాశం ఉంది. వీరంతా తిరిగి 15న హైదరాబాద్‌కు చేరుకుంటారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లనున్నారు.
ఇటీవలే ఢిల్లీకి వెళ్లిన ఈటల.. బీజేపీ పెద్దలతో మంతనాలు జరిపారు. అనంతరం తన నియోజకవర్గం హుజూరాబాద్‌లో అనుచరులతో చర్చలు జరిపారు. ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.ఆయనతో పాటు హుజురాబాద్ నియోజకవర్గ నాయకులతో పాటు మరికొందరు ఇతర జిల్లాల నేతలు కూడా కమలం గూటికి చేరనున్నారు. ఇప్పటికే తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ ఢిల్లీ చేరుకున్నారు. ఆపార్టీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డాతో భేటీ కానున్నారు. ఈటల చేరిక అనంతర పరిణామాలు, హుజూరాబాద్ ఉప ఎన్నికపై చర్చించనున్నారు. బండి సంజయ్, కిషన్‌రెడ్డి, జేపీ నడ్డా భేటీ తర్వాత ఈటల బీజేపీలో చేరతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీలో చేరిన అనంతరం హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన వెంటనే ఘన స్వాగతం పలికేందుకు ఈటల అనుచరులు ఏర్పాట్లు చేస్తున్నారు.