ఈటల రాజేందర్ రాజీనామాకు ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఈటల రాజేందర్ శుక్రవారం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. జూన్ 8 లేదా 9వ తేదీల్లో బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది.
బీజేపీలో ఈటల చేరబోతున్నారనే సంకేతాలు ఇప్పటికే వచ్చాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్‌ను, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలిసి ఈటల రాజేందర్ చర్చించారు. ఏనుగు రవీందర్‌రెడ్డి, తరుణ్ చుగ్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామితో కలిసి బీజేపీ జాతీయ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో బుధవారం సాయంత్రం ఈటల భేటీ అయ్యారు. ముందు ఎమ్మెల్యే పదవికి, ఆ తర్వాత టీఆర్ఎస్‌కు ఈటల రాజీనామా చేస్తారని, ఆ తర్వాత మంచి రోజు చూసుకుని బీజేపీలో చేరనున్నారు.
ఈటల రాజేందర్ ఢిల్లీలో పలు బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని ఈటల రాజేందర్ హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈటలకు ఆయన అనుచరులు, మద్దతుదారులు ఘనస్వాగతం పలికారు. ఈటల రాజేందర్ వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి కూడా ఉన్నారు. శుక్రవారం నాడు ఈటల మీడియా సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యచరణ ప్రకటించనున్నారు.