బీజేపీ ఛీప్‌ జేపీ నడ్డాతో భేటీ అయిన ఈటెల‌

Etela Rajendar Meet With JP Nadda. మాజీమంత్రి ఈటల రాజేందర్ ఆదివారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన విష‌యం తెలిసిందే. అక్క‌డ ఆయ‌న

By Medi Samrat  Published on  31 May 2021 4:25 PM GMT
బీజేపీ ఛీప్‌ జేపీ నడ్డాతో భేటీ అయిన ఈటెల‌

మాజీమంత్రి ఈటల రాజేందర్ ఆదివారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన విష‌యం తెలిసిందే. అక్క‌డ ఆయ‌న నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఆయనతో పాటు జేపీ నడ్డాను క‌లిసిన వారిలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ ఛుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్ కూడా ఉన్నారు. ఇక ఈటల వెంట టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా ఉన్నారు. ఈటల బీజేపీలో చేరుతున్నారన్న వార్తల నేపథ్యంలో జేపీ నడ్డాతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అతి త్వరలోనే ఈటల బీజేపీలో చేరనున్న‌ట్లు తెలుస్తోంది.


Next Story