టీఆర్ఎస్‌లో తనకు పట్టిన గతే.. హరీష్‌రావుకు పడుతుంది

Etela Rajendar Fire On Harish Rao. తెలంగాణ‌ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావుపై మాజీ ఆరోగ్య‌ మంత్రి ఈటల రాజేందర్ పై ఘాటైన

By Medi Samrat  Published on  6 July 2021 6:16 PM IST
టీఆర్ఎస్‌లో తనకు పట్టిన గతే.. హరీష్‌రావుకు పడుతుంది

తెలంగాణ‌ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావుపై మాజీ ఆరోగ్య‌ మంత్రి ఈటల రాజేందర్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ నియోజక వర్గంలోని కొంద‌రికి హరీష్ రావు దావత్ కు డబ్బులు ఇచ్చి మెప్పు పొందాలని చూస్తున్నారని ఈటల ఆరోపించారు. డబ్బు ప్రలోభాలను పాతరేసే సత్తా హుజురాబాద్ ప్రజలకుందని ఆయన చెప్పారు. తమతో తిరిగే యువకుల్ని పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని.. అందరినీ బెదిరించి టీఆర్‌ఎస్‌ కండువాలు కప్పుతున్నారని ఈటల ఆరోపించారు.

అయితే.. టీఆర్ఎస్‌లో తనకు పట్టిన గతే.. హరీష్‌రావుకు పడుతుందని ఈటెల ఘాటువ్యాఖ్య‌లు చేశారు. మంత్రులు ఎమ్మెల్యేలకు స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడిస్తున్నారని.. కొందరు మంత్రులు ఎమ్మెల్యేలతో తనపై అవాకులు చెవాకులు మాట్లాడిస్తున్నారని ఈటల అన్నారు. తాను వరంగల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు తనపై కేసీఆర్ కుట్రలు చేశారని ఈటల ఆరోపించారు. వారి అబద్ధాల పత్రిక ఛానల్‌లో పదేపదే చూపించారని అన్నారు. ఆ వార్తలు చూసిన ప్రతి తెలంగాణ బిడ్డ కన్నీరు పెట్టారని ఈటల పేర్కోన్నారు.


Next Story