ధనిక రాష్టం అనిచెప్పే కేసీఆర్ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శించారు. పెద్దపల్లి జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. గాలికి దీపంపెట్టి విద్యార్థుల జీవితాలతో చెలగాటం అడుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ మంత్రులందరిని బానిస వ్యవస్థగా తయారు చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి కనీసం వరద బాధితులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టలేదని ఫైర్ అయ్యారు. సొంత పేపర్, ఛానల్లో డబ్బా కొడుతున్నడే.. తప్ప చేసింది ఏమిలేదని అన్నారు. నేను ఇంజనీర్ అనే చెప్పుకునే ముఖ్యమంత్రి.. అన్నారం, మేడిగడ్డ పంప్ హౌస్ లు ఎందుకు నీట మునిగాయో చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి నిరో చక్రవర్తి లాగా వ్యవహరిస్తున్నారని.. ప్రభుత్వం నడిపే సత్తా లేకపోతే రాజీనామా చేయాలని అన్నారు.