సహచరులు కనుమరుగై.. ద్రోహులు రాజ్యమేలుతున్నారు

Etela Rajendar Comments On CM KCR. మాజీమంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ గురువారం అపోలో ఆసుప‌త్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.

By Medi Samrat  Published on  5 Aug 2021 8:42 AM GMT
సహచరులు కనుమరుగై.. ద్రోహులు రాజ్యమేలుతున్నారు

మాజీమంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ గురువారం అపోలో ఆసుప‌త్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఉద్యమ సహచరులు కనుమరుగై.. ఉద్యమ ద్రోహులు రాజ్యమేలుతున్నారని అన్నారు. మానుకోటలో మా రక్తాన్ని కళ్ళ చూసిన కౌశిక్ రెడ్డికి.. ఎమ్మెల్సీ సీటు ఇచ్చి ఉద్యమ కారుల గుండెల్ని గాయాలు చేశారని అన్నారు. 2018లో కౌశిక్ రెడ్డి కేసీఆర్‌ కోవర్ట్ గా పని చేసినందుకు.. అయ‌న‌కు ఇప్పుడు గిఫ్ట్ ఇచ్చినట్లుందని విమ‌ర్శించారు. రాజకీయ పార్టీలు ప్రజలను నమ్ముకుంటారు కానీ కేసీఆర్‌ డబ్బులు నమ్ముకున్నారని అన్నారు. ఇప్పటికే రూ.150 కోట్లు నగదు రూపంలో హుజురాబాద్ లో నాయకులకు ఇచ్చారని.. ఇలాంటి ప్రభుత్వాన్ని భరిద్దమా? అంటూ ప్ర‌శ్నించారు.


ఇదిలావుంటే.. 'ప్రజా దీవెన యాత్ర' పేరుతో హుజురాబాద్‌ నియోజకవర్గంలో ఈటెల‌ పాదయాత్ర చేపట్టారు. పాదయాత్ర చేస్తుండ‌గా ఈటెల ఆరోగ్యం క్షీణించింది. జ్వరంతో పాటు కాళ్లనొప్పులతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. వీణవంక మండలం కొండపాక వరకు పాదయాత్ర కొనసాగించిన ఆయన.. మధ్యాహ్న భోజనం ముగించిన అనంతరం బాగా నీరసించిపోయారు. దీంతో హైద్రాబాద్ అపోలో ఆసుప‌త్రిలో జాయిన్ అయ్యారు. ఈటెల అనారోగ్యం పాల‌వ‌డంతో ప‌లువురు నాయ‌కులు ఆసుప‌త్రికి వెళ్లి ప‌రామర్శించారు.


Next Story
Share it