ఈటల రాజేందర్ తెలంగాణ రాష్ట్ర సమితిని వీడే సమయంలో పెద్ద హై డ్రామా చోటు చేసుకున్న సంగతి తెలిసిందే..! తనను అనవసరంగా బయటకు వెళ్ళగొట్టారంటూ ఈటల చెప్పుకొచ్చారు. తానే తప్పూ చేయలేదని.. అయినా కూడా తనను బయటకు పంపించే చర్యలు తీసుకున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. ఆ తర్వాత సమీకరణాలు మారిపోయాయి. టీఆర్ఎస్ కు ఈటల రాజీనామా చేయడం.. ఢిల్లీకి వెళ్లి బీజేపీ తీర్థం పుచ్చుకోవడం.. ఇలా చాలానే జరిగాయి. ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం రంగం సిద్ధమైంది. ఇలాంటి సమయంలో ఈటల రాజేందర్ కేసీఆర్ కు రాసిన లేఖ కలకలం రేపుతుంది. ఆయన వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ఈ లేఖ రాసినట్లుగా సోషల్ మీడియాలో ఈ లేఖ వైరల్ అవుతుంది.
ఈ లేఖలో తాను చేసింది తప్పేనని.. క్షమించమని ఈటల రాజేందర్ కోరినట్లుగా ఉంది. తాను సమావేశాలు జరిపింది నిజమేనని,ఈ సమావేశాలకు పెద్దపల్లి లీడర్లు కూడా హాజరయ్యారని.. తామంతా పార్టీకి విధేయులుగానే ఉంటామని ఈటల రాజేందర్ చెప్పినట్లుగా అందులో. మీతో సాన్నిహిత్యం ఎంతో గొప్పదని, నా వేలు పెట్టుకుని నడిపించారని కేసీఆర్ ను పొగుడుతూ అందులో ఈటల రాజేందర్ అన్నట్లుగా ఉంది. వైరల్ అవుతున్న ఫోటోను ఇక్కడ మీరు కూడా చూడొచ్చు.
అయితే ఈ లెటర్ ఫేక్ అని.. ఈటల రాజేందర్ ను ఇరుకున పెట్టడానికే కొందరు ఈ లేఖను సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని కామెంట్లు వస్తున్నాయి. ఈటల రాజేందర్ రాసిన లేఖ అంటూ ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది. దీనిపై ఎవరెవరు స్పందిస్తారో చూడాలి.