ఈటెల అంటే నిప్పు.. విచార‌ణ చేయండి

Etela Clarification On Land Scam. తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలపై

By Medi Samrat  Published on  30 April 2021 4:14 PM GMT
ఈటెల అంటే నిప్పు.. విచార‌ణ చేయండి

తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలపై వివరణ ఇచ్చారు. ముందస్తు ప్రణాళికతో దుష్ప్రచారం చేశారని, తనపై కట్టుకథలు అల్లారని.. అంతిమ విజయం ధర్మానిదే అని స్పష్టం చేశారు. ఒక ఎకరం కూడా తన స్వాధీనంలో లేదన్నారు. హైదరాబాద్‌ శామీర్‌పేటలోని తన నివాసంలో వివరణ ఇచ్చిన ఈటెల ఈ వ్యాఖ్య‌లు చేశారు.

2016లో హ్యాచరీ ప‌రిశ్ర‌మ‌ పెట్టాలని నిర్ణయించుకుని అచ్చంపల్లి ప్రాంతంలో ఎక‌రా రూ. 6 లక్షల చొప్పున 40, 50 ఎకరాలు కొన్నామ‌ని కొన్నామ‌ని తెలిపారు. త‌ద‌నంత‌రం కెనరా బ్యాంక్‌ ద్వారా రూ. వంద కోట్ల రుణం తీసుకుని హ్యాచరీ అభివృద్ధి చేశామ‌ని అన్నారు. అ త‌ర్వాత కూడా విస్తరణ కోసం భూములు కొన్నామ‌ని.. ఈ విష‌యాలు సీఎం కేసీఆర్‌కు కూడా చెప్పామ‌ని అన్నారు. భూకబ్జా ఆరోపణలు అత్యంత నీచమైనవ‌ని.. ఇలాంటి కథలు చెప్పి.. ఇంత దుర్మార్గానికి పాల్ప‌డ‌టం తగదని ఈటెల రాజేంద‌ర్‌ ఫైర‌య్యారు.

అరోప‌ణ‌ల నేఫ‌థ్యంలో.. ఎన్ని కమిటీలు ఉంటే అన్ని వేసి విచారణ చేయాల‌ని ఈటెల‌ సవాల్‌ విసిరారు. అవినీతి చేశాన‌ని తేలితే ముక్కు నేలకు రాస్తాన‌ని అన్నారు. తాను ఎప్పుడూ ప్రశ్నించేవిధంగానే ఉంటాన‌ని.. చిల్ల‌ర‌కు లొంగే మ‌నిషిని కాద‌ని.. మంత్రి పదవికి నాకు గడ్డిపోచ కింద లెక్కని.. నా ఆత్మగౌరవం కన్నా మంత్రి పదవి ముఖ్యం కాదని గ‌ద్గ‌ద స్వ‌రంతో అన్నారు. తన చరిత్ర ఏందో చెరిపేస్తే చెరగనిద‌ని.. సిట్టింగ్‌ జడ్జి, సీబీఐ.. ఎన్ని సంస్థలు ఉన్నాయో వాటితో విచారణ జ‌రిపించాల‌ని.. ఈటల అంటే నిప్పు అని వ్యాఖ్యానించారు.Next Story
Share it