హుజురాబాద్‌ ఉపఎన్నికలో ఈటెల రాజేందర్ ఘ‌న‌విజయం

Etela Rajendar Won In Huzurabad ByPoll. హుజురాబాద్‌ ఉపఎన్నికలో బీజేపీ విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌పై

By Medi Samrat  Published on  2 Nov 2021 7:01 PM IST
హుజురాబాద్‌ ఉపఎన్నికలో ఈటెల రాజేందర్ ఘ‌న‌విజయం

హుజురాబాద్‌ ఉపఎన్నికలో బీజేపీ విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌పై బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ 23, 865 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొట‌ది రౌండ్ నుండి దాదాపు అన్ని రౌండ్లలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఆధిక్యం కనబర్చారు. 22వ రౌండ్‌లో బీజేపీకి 4481 ఓట్లు రాగా.. టీఆర్ఎస్ 3351 ఓట్లు సాధించింది. దీంతో చివ‌రి రౌండ్‌లో ఈటెల రాజేందర్ 1,130 ఓట్ల ఆధిక్యం సాధించారు. మొత్తంగా ఈటెల రాజేందర్‌కు 1,06,213 ఓట్లు రాగా.. టీఆర్ఎస్ అభ్య‌ర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు 82,348 ఓట్లు వచ్చాయి. దీంతో 2004 నుంచి వరుసగా ఏడు సార్లు ఈటెల రాజేందర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.


Next Story