గద్దర్ సినీ అవార్డులకు ఎంట్రీలు..కేటగిరీలవారీగా ఆహ్వానించిన సర్కార్

గద్దర్ తెలంగాణ చలన చిత్ర అవార్డులకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

By Knakam Karthik
Published on : 11 March 2025 5:57 PM IST

Telangana, Gaddar Film Awards, Cinema, Congress government

గద్దర్ సినీ అవార్డులకు ఎంట్రీలు..కేటగిరీలవారీగా ఆహ్వానించిన సర్కార్

గద్దర్ తెలంగాణ చలన చిత్ర అవార్డులకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ చలనచిత్రాలకు ఇవ్వనున్న గద్దర్ సినీ అవార్డుల కార్యక్రమం ఏప్రిల్‌లో జరగనున్నట్టు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ అవార్డులకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను ఇచ్చిన మాట ప్రకారం గద్దర్ అవార్డులకు గాను జీ.ఓ ఎం.ఎస్ నెంబర్ 25 జీ,ఓ. (ఐ అండ్ పీఆర్) తేదీ.11.3.2025 ను నేడు విడుదల చేసింది.

తెలంగాణ సినిమా రంగానికి విశేష సేవలనందించిన పైడి జయరాజ్, కాంతారావు పేర్లపై ప్రత్యేక అవార్డులు ఇవ్వాలని, ఇప్పటికే ప్రముఖ నటులు ఎం.ప్రభాకర్ రెడ్డి పేరుపై ఉన్న ప్రజాదరణ పొందిన చలన చిత్రానికి అవార్డును కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2014 నుండి 2023 వరకు అప్పటి తెలంగాణా ప్రభుత్వం చలన చిత్ర అవార్డులను జారీ చేయక పోవడంతో, ఆ సంవత్సరాలకు కూడా ఒక్కో సంవత్సరానికి ఒక ఉత్తమ చలన చిత్రానికి అవార్డు నివ్వాలని నిర్ణయించారు. ఫీచర్ ఫిలిం కాటగిరిలో మొట్టమొదటి సారిగా ఉర్దూ భాషా చిత్రాలకు కూడా అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గద్దర్ చలన చిత్ర అవార్డులకు సంబందించిన దరఖాస్తులు ఏ.సి గార్డ్స్ లోని తెలంగాణా చలన చిత్ర పరిశ్రమాభివృద్ది సంస్థ కార్యాలయంలో తేదీ.13 .3 .2025 నుండి అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ గద్దర్ అవార్డులను ఈ క్రింది కేటగిరీలలో ఇవ్వడం జరుగుతుందని ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు.

కేటగిరీలవారీగా అవార్డులు..

*ఫీచర్ ఫిల్మ్స్

*జాతీయ సమైక్యతపై చలన చిత్రం

*బాలల చలన చిత్రం

*పర్యావరణం/హెరిటేజ్/ చరిత్రలపై చలన చిత్రం

*డెబిట్ ఫీచర్ ఫిల్మ్స్

*యానిమేషన్ ఫిలిం

*సోషల్ ఎఫక్ట్ ఫిల్మ్స్

*డాక్యుమెంటరీ ఫిల్మ్స్

*షార్ట్ ఫిల్మ్స్

ఇతర కాటగిరీలు

*తెలుగు సినిమాలపై బుక్స్/ విశ్లేషణాత్మక వ్యాసాలు.

*ఆర్టిస్టులు/ టెక్నీషియన్లకు వ్యక్తిగత అవార్డులు

Next Story