Delhi Liquor Scam : ముగిసిన క‌విత ఈడీ విచార‌ణ‌

Ended Kavitha ED investigation. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మూడో రోజు విచారణ ముగిసింది.

By Medi Samrat
Published on : 21 March 2023 10:11 PM IST

Delhi Liquor Scam : ముగిసిన క‌విత ఈడీ విచార‌ణ‌

Ended Kavitha ED investigation


ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మూడో రోజు విచారణ ముగిసింది. ఈడీ కార్యాలయం నుంచి కవిత బయటకొచ్చారు. బీఆర్ఎస్ శ్రేణులకు అభివాదం చేస్తూ తుగ్లగ్ రోడ్‌లోని కేసీఆర్ నివాసానికి ఆమె బయలుదేరారు. అయితే తదుపరి విచారణ రావాలంటూ ఈడీ ఏమైనా సమాచారం ఇచ్చిందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఉదయం 11.30 గంటలకు కవిత ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. నిన్న‌ సుమారు 10 గంటల పాటు కవితను విచారించిన‌ ఈడీ అధికారులు.. ఈ రోజు కూడా దాదాపు అంతే స‌మ‌యం ప్ర‌శ్నించారు. పీఎంఎల్‌ఏ సెక్షన్ 50 కింద ఎమ్మెల్సీ కవితను ఈడీ ప్రశ్నించింది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మనీలాండరింగ్‌ ఆరోపణలతో ఎమ్మెల్సీ కవితను ఈడీ ఇప్పటికే రెండుసార్లు విచారించింది. ఈ రోజు మూడోసారి క‌విత ఈడీ ఎదుట హాజ‌ర‌య్యారు. రాత్రి 9 గంటలు దాటినా తర్వాత కవిత విచార‌ణ ముగియ‌క‌పోవ‌డంతో.. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆఫీసు వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. విచార‌ణ అనంత‌రం అనంత‌రం బ‌య‌ట‌కు వ‌చ్చిన క‌విత విజ‌య చిహ్నం చూపుతూ.. త‌న కాన్వాయ్‌లో బ‌య‌ల్దేరారు.




Next Story