కేటీఆర్‌కు ఈడీ నోటీసులు

ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో తెలంగాణ మాజీ మంత్రికి ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 7 న ఈడీ విచారణ కు హాజరు కావాలని ఈడీ నోటీసులు పంపింది.

By M.S.R  Published on  28 Dec 2024 10:29 AM IST
కేటీఆర్‌కు ఈడీ నోటీసులు

ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో తెలంగాణ మాజీ మంత్రికి ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 7 న ఈడీ విచారణ కు హాజరు కావాలని ఈడీ నోటీసులు పంపింది. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డిలకు జనవరి 2, 3 తేదీల్లో విచారణ కు రావాలని నోటీసులు పంపింది. ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా పీఎంఎల్‌ఏ కింద ఈడీ విచారణ చేస్తోంది. పెమా నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ఇప్పటికే ఈడీ గుర్తించింది. 55 కోట్లు నగదు బదిలీపై ఈడీ విచారణ జరుపుతూ ఉంది.

ఫార్ములా ఈ-రేసింగ్ ఈవెంట్‌ను ఫిబ్రవరి 2023లో హైదరాబాద్‌కు తీసుకురావడంలో ఆర్థిక అవకతవకలు జరిగాయని కేటీ రామారావుపై అవినీతి నిరోధక శాఖ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. కేటీఆర్ ను ప్రధాన నిందితుడిగా పేర్కొనగా, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ (ఎంఎయుడి) మాజీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌ రెండో ముద్దాయిగా, హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండిఎ) మాజీ చీఫ్‌ ఇంజనీర్‌ బిఎల్‌ఎన్‌ రెడ్డిని మూడో ముద్దాయిగా పేర్కొన్నారు.

Next Story