తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై దూషణలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. వ్యక్తిగతంగా కేసీఆర్‌ను దూషించినందుకు, అసభ్యపదజాలం వాడిన ఘటనలపై బీఆర్‌ఎస్ నేతల ఫిర్యాదుతో సీఎంకు ఈ నోటీసులు పంపింది.
48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని రేవంత్‌కు ఈసీ స్పష్టం చేసింది. ఎంసీసీని ఉల్లంఘిస్తూ బహిరంగ సభల్లో కేసీఆర్‌పై విమర్శలు చేస్తూ, కించపరిచేలా, వ్యక్తిగతంగా, కించపరిచేలా, అసభ్య పదజాలంతో సీఎం రేవంత్ దూషించారని బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ ఎం.శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. సకేసీఆర్ మతి ఉండి మాట్లాడుతుండో.. మందు వేసి మాట్లాడుతుండో తెలియట్లేదు. సోయిలేనోడు, సన్నాసోడు, చవట, దద్దమ్మ, దిక్కుమాలినోడాస అంటూ కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి రెచ్చిపోయారు. రైతుబంధు సాయం, రైతురుణమఫీ విషయంలో కేసీఆర్, రేవంత్ మధ్య విమర్శలు జరిగాయి.