మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటెల రాజేందర్‌ అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఇటీవల 'ప్రజా దీవెన యాత్ర' పేరుతో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పాదయాత్ర కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి తెలిపారు. ఈటెల రాజేందర్ ప్రస్తుతం జ్వరంతో పాటు కాళ్లనొప్పులతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. వీణవంక మండలం కొండపాక వరకు పాదయాత్ర కొనసాగించిన ఆయన శనివారం మధ్యాహ్న భోజనం ముగించిన అనంతరం బాగా నీరసించిపోయారని వెల్లడించారు.

కాగా ఈటెలకు వెంటనే వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఆయనకు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఈటెలను హైదరాబాద్ కి తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు స్థానిక బీజేపీ నేతలు. ఈ నెల 19వ తేదీన ప్రారంభించబడిన ప్రజా దీవెన యాత్ర ఈ రోజుతో 12 వ రోజుకి చేరుకుంది. ఇక ఇప్పటి వరకు 70 గ్రామాల్లో 222 కిలోమీటర్లు పూర్తి చేసారు ఈటెల. అస్వ‌స్థ‌త‌ నేపథ్యంలో పాదయాత్రకు తాత్కాలిక విరామం ఇస్తారని తెలుస్తోంది.


సామ్రాట్

Next Story