సంగారెడ్డి జిల్లాలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. కోహీర్ మండలం బిలాల్‌పూర్‌లో మంగళవారం తెల్లవారుజామున 3.20 గంటల ప్రాంతంలో భూమి కంపించింది. నిద్రలోంచి ఉలిక్కిపలి లేచిన ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 3.6 గా నమోదు అయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. నల్లగొండకు 117 కిలోమీటర్ల దూరంలో, భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో భూ కంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. అయితే.. ఈ ప్రకంపనల కారణంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం అందలేదని అధికారులు తెలిపారు.