తెలంగాణ‌లో భూ ప్ర‌కంప‌న‌లు..!

Earthquake in Manchirala district.తెలంగాణ రాష్ట్రంలోని ప‌లు చోట్ల భూప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Oct 2021 3:15 PM IST
తెలంగాణ‌లో భూ ప్ర‌కంప‌న‌లు..!

తెలంగాణ రాష్ట్రంలో ప‌లు చోట్ల భూప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి. రామ‌గుండం, మంచిర్యాల‌, క‌రీనంగ‌ర్ ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది. భూమి కంపించ‌డంతో ప్ర‌జ‌లు భ‌యంతో ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు దీశారు. మంచిర్యాలోని చున్నంబట్టి వాడ, శ్రీశ్రీ నగర్, సీతారాంపల్లి, నస్పూర్, సీతా రాంపూర్ తదితర‌ ప్రాంతాల్లో రెండు సెకండ్ల పాటు స్వల్పంగా భూమి కంపించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కాగా.. రిక్ట‌ర్ స్కేల్‌పై దీని తీవ్ర‌త 4గా నమోదైన‌ట్లు తెలుస్తోంది. కాగా.. భూకంపం కార‌ణంగా ఎలాంటి ప్రాణ‌, ఆస్తి న‌ష్టం జ‌రిగిన‌ట్లు ఇప్ప‌టి వ‌ర‌కు స‌మాచారం అంద‌లేదు.


Next Story