తెలంగాణలో ఆన్‌లైన్ క్లాసుల నిర్వహణకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు డెరైక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ శనివారం 8, 9 మరియు 10 తరగతుల విద్యార్ధులకు ఆన్‌లైన్ క్లాసుల నిర్వహణకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 24 నుండి రొటేషన్ ప్రాతిపదికన క్లాసులు జరుపనున్నట్లు తెలిపింది. 50 శాతం మంది సిబ్బంది(టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్) పాఠశాలలకు హాజరు కావాలని శనివారం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జనవరి 30 వరకు మెడికల్ కాలేజీలు మినహా.. అన్ని విద్యా సంస్థలకు సెలవులను పొడిగించిన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. తదనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల అధిపతులు, పాఠశాల విద్య, హైదరాబాద్ మరియు వరంగల్ ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్లు మరియు రాష్ట్రంలోని అన్ని జిల్లా విద్యాశాఖాధికారులను డైరెక్టరేట్ ఆదేశించింది.