కీల‌క నిర్ణ‌యం : డ్రోన్ల స‌హాయంతో కరోనా వ్యాక్సిన్ పంపిణీ

Drones For Corona Vaccine Supply. తెలంగాణలో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టింది.

By Medi Samrat  Published on  30 April 2021 2:20 PM GMT
కీల‌క నిర్ణ‌యం : డ్రోన్ల స‌హాయంతో కరోనా వ్యాక్సిన్ పంపిణీ

తెలంగాణలో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టింది. కరోనా వ్యాక్సిన్ పంపిణీలో డ్రోన్లను వినియోగించాలని నిర్ణయించింది. దీనికి డీజీసీఏ (డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) నుంచి అనుమతి కూడా లభించింది. ఈ మేర‌కు డ్రోన్ల వినియోగంపై డీజీసీఏ అనుమతి.. ఏడాది పాటు అమల్లో ఉండనుంది.

ఇదిలావుంటే.. మే 8 వరకు నైట్ క‌ర్ఫ్యూ అమల్లో ఉంటుంద‌ని రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే.. కరోనా వ్యాక్సిన్ల కొరతను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు ఆసుపత్రులకు వ్యాక్సిన్ డోసుల పంపిణీ నిలిపివేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న డోసులు వాడుకోవాలని ప్రైవేటు ఆసుపత్రులకు సూచించారు.


Next Story