తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ బెయిల్ పిటిషన్ పై మల్కాజ్ గిరి కోర్టు విచారణ జరిపింది. రెండు రెగ్యులర్ బెయిల్స్, మరో ముందోస్తు బెయిల్ కలిపి విచారించాలంటూ మల్లన్న తరపు న్యాయవాది కోరారు. మూడు పిటిషన్లు ఒకేసారి విచారణ జరపడానికి అంగీకరించిన మల్కాజ్ గిరి కోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 6 కు వాయిదా వేసింది.
తీన్మార్ మల్లన్నపై ప్రిజనర్ ఆన్ ట్రాన్సిట్ (పీటీ) వారెంట్ దాఖలు చేయొద్దని పోలీసులకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 10 కి వాయిదా వేసింది. మల్లన్నపై నమోదైన వివిధ కేసుల్లో పోలీసులు పీటీ వారెంట్లు అమలు చేస్తూ జైలు నుంచి బయటికి రాకుండా చేస్తున్నారని పేర్కొంటూ ఆయన భార్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. ఒకే రకమైన ఫిర్యాదులపై అనేక కేసులు నమోదు చేయడం ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించింది.