అసత్య ప్రచారాలు నమ్మకండి: టీపీసీసీ చీఫ్ మహేశ్‌

లంగాణ బంజారా భారతి ఆధ్వర్యంలో లంబడాలను షెడ్యూల్‌ ట్రైబ్ రిజర్వేషన్లలో చేర్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవాలు నిర్వహించారు.

By -  Knakam Karthik
Published on : 21 Sept 2025 3:06 PM IST

Telanagana, Hyderabad, TPCC Chief Mahesh, Congress Goverment

హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని భారత మాజీ ప్రధాని భారతరత్న ఇందిరాగాంధీ కాంస్య విగ్రహం వద్ద తెలంగాణ బంజారా భారతి ఆధ్వర్యంలో లంబడాలను షెడ్యూల్‌ ట్రైబ్ రిజర్వేషన్లలో చేర్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హాజరై ఇందిరా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి, డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్, తెలంగాణవార్ రూం ఇంచార్జ్ అనుష, మాజీ ఎంపీ రవీందర్ నాయక్, బంజారా భారతి అధ్యక్షులు జగన్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ఉక్కు మహిళ ఇందిరా గాంధీ దేశంలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొచ్చారు. సీలింగ్‌ ఆక్ట్‌ ద్వారా పేదలకు భూములు పంచిన మహానియురాలు ఇందిరా గాంధీ. బంజరాలను షెడ్యూల్డ్ ట్రైబ్‌లో చేర్చిన చలువ ఇందిరా గాంధీది. "ఎవరు ఎంత నిష్పత్తిలో ఉంటే వారికి అంత వాటా" అనే రాహుల్ గాంధీ నినాదానికి కట్టుబడి కుల సర్వే నిర్వహించాం. అన్ని వర్గాలకు కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం ఉంది. ప్రతిపక్షాలు సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారు. మార్ఫింగ్‌ చేసి అసత్యాలను ప్రచారం చేస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. అసత్య ప్రచారాలను నమ్మకండి..అని మహేశ్ కుమార్ గౌడ్ కోరారు.

Next Story