దిశ కేసు ఎన్‌కౌంటర్ విచారణలో భాగంగా సుప్రీంకోర్టు కేసును హైకోర్టు బదిలీ చేసింది. సిర్పూర్కర్ కమిషన్ ఈ ఎన్‌కౌంటర్ ను ఫేక్ అని తేల్చేసింది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ ఘటన బూటకమని.. ఈ ఘటనపై విచారణ చేపట్టిన సిర్పూర్కర్ కమిషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు 387 పేజీలతో సుప్రీంకోర్టుకు కమిషన్ రిపోర్ట్ సమర్పించింది. పోలీసులు కావాలనే నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్ చేశారని సిర్పూర్కర్ కమిషన్ నివేదికలో పేర్కొంది.
పోలీస్ మాన్యువల్‌కు విరుద్ధంగా విచారణ జరిగిందని కమిషన్ పేర్కొంది. ప్రజల ఆగ్రహాన్ని కట్టడి చేసేందుకే పోలీసులు కాల్చి చంపారని నివేదిక తేల్చింది. తక్షణ నాయ్యం కోసమే ఎన్‌కౌంటర్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కాకుండా విచారణ పేరుతో వేరే అధికారులు వారిని వేధింపులకు గురి చేశారు. పోలీసులు గాయాలతో ఆసుపత్రిలో చేరడం ఓ కట్టుకథ అని నివేదికలో పేర్కొంది.
పోలీస్ మ్యానువల్‌కు భిన్నంగా విచారణ చేపట్టినట్టు తెలిపిన కమిషన్.. నిందితుల్లో ముగ్గురు మైనర్లన్న విషయం పోలీసులు దాచారని నివేదికలో వెల్లడించింది. ఎన్‌కౌంటర్ స్థలంలో సీసీటీవీ ఫుటేజీ దొరక్కుండా చేశారని.. దిశ నిందితులే ముందుగా పోలీసులపై కాల్పులు జరిపారనేది అబద్ధమని రిపోర్ట్‌లో పేర్కొంది. నిందితుల తరఫు లాయర్ సిర్పూర్కర్ కమిషన్ నివేదికను మీడియాకు అందించారు.