తెలంగాణలో ఆరు గ్యారెంటీలను అమలుచేసి తీరుతాం : కర్ణాటక మంత్రి

ఐదు రాష్ట్రల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.. వివిధ పార్టీలను ఈ ఎన్నికల్లో ఎదుర్కొంటున్నామ‌ని కర్ణాటక మంత్రి దినేష్ గుండురావు అన్నారు

By Medi Samrat  Published on  14 Nov 2023 5:16 PM IST
తెలంగాణలో ఆరు గ్యారెంటీలను అమలుచేసి తీరుతాం : కర్ణాటక మంత్రి

ఐదు రాష్ట్రల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.. వివిధ పార్టీలను ఈ ఎన్నికల్లో ఎదుర్కొంటున్నామ‌ని కర్ణాటక మంత్రి దినేష్ గుండురావు అన్నారు. గాంధీభవన్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఏంటో వివ‌ధ‌ రాష్ట్రాలలో గెలిచి చూపించామ‌న్నారు. తెలంగాణ లో బీఆర్ఎస్ ను కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఎదుర్కొంటుందన్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ వేగంగా పుంజుకుందన్నారు. అభివృద్ధి నినాదం మీద ఏర్పడ్డ తెలంగాణ కేసీఆర్ కుటుంబం చేతిలో ఉందన్నారు,

తెలంగాణ మిగులు నిధులతో ఆర్థికంగా బలమైన రాష్ట్రం.. కానీ అభివృద్ధి శూన్యం అన్నారు. కర్ణాటకలో ఐదు గ్యారంటీలను మూడు నెలల్లోనే అమలు చేశామ‌న్నారు. కేంద్రం సపోర్ట్ చేయకపోయినా బియ్యం పంపిణీ చేస్తున్నామ‌న్నారు. మన దేశంలో లక్షల కోట్ల రూపాయలను ధ‌నికులు, వ్యాపారులు కొల్లాగొట్టారని అన్నారు. తెలంగాణలో ఆరు గ్యారెంటీలను అమలుచేసి తీరుతామ‌న్నారు. విద్యుత్ విషయంలో తెలంగాణ పరిస్థితులకు కర్ణాటక పరిస్థితులకు చాలా తేడా ఉందన్నారు. అయినా కర్ణాటక లో ఎలాంటి సమస్య లేదన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులకు ఏమైనా డౌట్ ఉంటే కర్ణాటక విజిట్ చేయడానికి స్వాగత్తిస్తామ‌న్నారు. సాధారణ పౌరులకు ఎలాంటి సమస్య లేకుండా కరెంట్ చార్జీలు అమలుచేస్తున్నామ‌న్నారు. కర్ణాటక రైతుల ధర్నా కావాలని ఆడిస్తున్న డ్రామా అని పేర్కొన్నారు.

Next Story