ఇండియా-పాకిస్థాన్ యుద్ధంలో అల్లు అర్జున్ ఏమైనా పాల్గొన్నాడా?

అల్లు అర్జున్ ఓ సినిమా నటుడు. సరిహద్దులో ఏమైనా భారత్-పాకిస్థాన్ యుద్ధం చేసి భారత్‌ ను గెలిపించాడా? సినిమా చేసి, డబ్బులు సంపాదించుకుని ఇంటికి వెళ్లిపోయాడని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ అరెస్టు గురించి వ్యాఖ్యానించారు.

By Kalasani Durgapraveen  Published on  14 Dec 2024 1:00 AM GMT
ఇండియా-పాకిస్థాన్ యుద్ధంలో అల్లు అర్జున్ ఏమైనా పాల్గొన్నాడా?

అల్లు అర్జున్ ఓ సినిమా నటుడు. సరిహద్దులో ఏమైనా భారత్-పాకిస్థాన్ యుద్ధం చేసి భారత్‌ ను గెలిపించాడా? సినిమా చేసి, డబ్బులు సంపాదించుకుని ఇంటికి వెళ్లిపోయాడని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ అరెస్టు గురించి వ్యాఖ్యానించారు. భారతదేశం కోసం ఏ యుద్ధంలో పోరాటం చేయలేదని, సినిమాల ద్వారా డబ్బు సంపాదించాడని రాజ్యాంగం ప్రజలందరికీ ఒకేలా ఉంటుందని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. శుక్రవారం ఓ జాతీయ టీవీ ఛానల్‌ ఆజ్‌ తక్‌లో ప్రసారమైన ఓ ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.

పుష్ప 2 బెనిఫిట్ షోకు తన ప్రభుత్వమే అనుమతినిచ్చిందని, అయితే అల్లు అర్జున్ థియేటర్ వద్దకు వచ్చి ప్రజలకు చేతులు ఊపడంతోనే తొక్కిసలాటకు దారితీసిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అల్లు అర్జున్‌తో సహా థియేటర్ యాజమాన్యం, ఇతరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ థియేటర్‌లో సినిమా చూసి వెళ్లి ఉంటే, పరిస్థితి అదుపులోకి వచ్చేది కాని నటుడు తన కారు పై నుండి ప్రజలు, అభిమానుల వైపు చేయి చేయడంతో పరిస్థితి అదుపు తప్పిందన్నారు.


Next Story