సర్పంచ్‌లకు మద్ధతుగా.. నడిరోడ్డుపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ధర్నా

మాజీ సర్పంచులకు మద్ధతుగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నడిరోడ్డుపై ధర్నాకు దిగారు.

By అంజి  Published on  4 Nov 2024 12:54 PM IST
Dharna, BRS MLAs, Sarpanchs, Telangana

సర్పంచ్‌లకు మద్ధతుగా.. నడిరోడ్డుపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ధర్నా 

హైదరాబాద్‌: మాజీ సర్పంచులకు మద్ధతుగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నడిరోడ్డుపై ధర్నాకు దిగారు. పెండింగ్‌ బిల్లులు చెల్లించాలనే డిమాండ్‌తో నిరసనలకు పిలుపునిచ్చిన మాజీ సర్పంచులను పోలీసులు అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్లకు తరలిస్తుండగా బీఆర్‌ఎస్‌ నేతలు అడ్డుకున్నారు. తిరుమలగిరి రోడ్డుపై ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎమ్మెల్యేలు హరీశ్‌ రావు, ప్రశాంత్‌ రెడ్డి, సంజయ్‌, కొత్త ప్రభాకర్‌ రెడ్డి ఆందోళన చేపట్టారు.

అప్పులు చేసి గ్రామాలను అభివృద్ధి చేసిన సర్పంచులకు పెండింగ్‌ బిల్లులు చెల్లించకుండా సీఎం రేవంత్‌ శిక్ష వేస్తున్నారని హరీశ్‌ రావు మండిపడ్డారు. వెంటనే పెండింగ్‌ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 'బడా కాంట్రాక్టర్లకు రూ.వందల కోట్ల బిల్లులు చెల్లిస్తున్నారు. కానీ పనులు చేసిన పాపానికి పేద సర్పంచులు శిక్ష అనుభవించాలా?' అని తిరుమలగిరి పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఆందోళనకు దిగారు. సర్పంచుల అరెస్ట్‌ను ఖండించారు.

Next Story