మరియమ్మ కుమారుడిని పరామర్శించిన డీజీపీ
DGP Mahendar Reddy Meet Mariyamma Family. లాకప్ డేత్ లో మృతి చెందిన మరియమ్మ కుమారుడ్ని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి
By Medi Samrat
లాకప్ డేత్ లో మృతి చెందిన మరియమ్మ కుమారుడ్ని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి పరామర్శించారు. ఖమ్మంలోని సంకల్ప ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉదయ్ కిరణ్‌ను డీజీపీ కలిశారు. అసలు అడ్డగూడురులో ఏం జరిగింది? ఎవరు మరియమ్మ ను, ఉదయ్ కిరణ్ ను కొట్టింది. అసలు విచారణ చేసి కొట్టిన వారు ఎంత మందో ఉదయ్ కిరణ్ ను స్వయంగా అడిగి తెలుసుకున్నారు డిజిపి. దీంతో డీజీపీ ఎదుట ఉదయ్ కిరణ్ కన్నీరు మున్నీరుగా విలపించాడు.
పోలీసులు అత్యంత క్రూరంగా తమను కొట్టారంటూ డిజిపి ఎదుట అతడు ఏడ్చాడు. తన చేతిలోనే తన తల్లి చనిపోయింది సార్ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తమకు న్యాయం చేయాలంటూ డీజీపీని ఉదయ్ కిరణ్ వేడుకున్నాడు. ఈ ఘటనకు కారణమైన పోలీసుల్ని సస్పెండ్ చేశామని డీజీపీ .. మరియమ్మ కొడుకుకు తెలిపారు. ప్రభుత్వం తప్పకుండా అండగా ఉంటుందని తెలిపారు. దాదాపు 30 నిమిషాల పాటు డీజీపీ ఆస్పత్రిలోనే ఉన్నారు.
అనంతరం మీడియా సమావేశంలో డిజీపి మాట్లాడుతూ.. ప్రెండ్లీ పోలిసింగ్‌లో ఇలాంటి ఘటనలు జరగటం బాదాకరమన్నారు. విచారణ సందర్బంలో ఇలాంటి ఘటన జరగటం బాధకరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చూస్తామన్నారు. బాధిత కుటుంబానికి సహాయ సహాకారాలు అందిస్తామని తెలిపారు. మొత్తం ఘటనపై విచారణ చేస్తున్నామని.. ఎవరు తప్పు చేసినా కఠిన చర్యలు తప్పవన్నారు. దోషులుగా తేలిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనలో ఉన్న అధికారులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామన్నారు డీజీపీ.